News December 14, 2025
తూ.గో: కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిగా మారితే.. ఆడపిల్లల భద్రతకు దిక్కెవరు? ఉప్పలగుప్తం మండలంలో 15 ఏళ్ల కుమార్తెపై <<18555090>>కన్నతండ్రే అత్యాచారానికి<<>> పాల్పడటం సభ్యసమాజాన్ని విస్మయానికి గురిచేసింది. రక్షకుడే రాక్షసుడైన ఈ ఉదంతం పవిత్ర బంధానికి మాయని మచ్చలా మారింది. అల్లారుముద్దుగా సాకాల్సిన వాడే చిదిమేస్తుంటే.. సమాజం ఎటుపోతోందన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది.
Similar News
News January 3, 2026
కాళేశ్వరంపై మోజు.. పాలమూరుపై నిర్లక్ష్యం: ఉత్తమ్

TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, కావాలనే పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. కానీ సోర్స్‌ను జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీలే తీసుకునేలా చేశారు. దీని వల్ల అంచనా వ్యయం రూ.85వేల కోట్లకు చేరింది’ అని తెలిపారు.
News January 3, 2026
HYD: ఆ ముగ్గురిపై మరో అధికారి ఉండరు: కర్ణన్

మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తరువాత వాటికి కొత్తగా ముగ్గురు కమిషనర్లు నియమితులవుతారని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. ఆ ముగ్గురు అధికారులపై మరో ఉన్నతాధికారి ఉండబోరని స్పష్టం చేశారు. ఈ అధికారులు ఎవరికి వారే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. గ్రేటర్ ఎన్నికలు పాలక మండలి ముగిసిన తరువాతే ఉంటాయని అసెంబ్లీ లాబీలో పేర్కొన్నారు.
News January 3, 2026
చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.


