News April 20, 2024
మెదక్: పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి నీలం మధు: సీఎం రేవంత్ రెడ్డి

పేదల కష్టాలు తెలిసిన, బడుగు బలహీన వర్గాలకు చెందిన నీలం మధునే మెదక్ ఎంపీగా గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మల్లన్నసాగర్ భూముల కోసం మహిళలను పోలీసులతో కొట్టించిన దుర్మార్గుడని అన్నారు. 10ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ.. మెదక్‌కు చేసిందేమీ లేదని, ఇప్పుడు గెలిపించినా ఏం చేయబోరన్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 13, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు 98.12 % హాజరు

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 4,801 మందికి గాను 4,711 మంది, ఒకేషనల్ విభాగంలో 267 మందికి గాను 262 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 98.12 శాతం హాజరు నమోదైందని అధికారి మాధవి తెలిపారు. నేటితో జనరల్ విభాగం పరీక్షలు పూర్తయ్యాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆమె పేర్కొన్నారు.
News March 13, 2026
మెదక్: ఇంటర్ విద్యార్థులకు యాక్సిడెంట్

టేక్మాల్ మండలం కద్దులూరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పులర్ నుంచి అల్లాదుర్గ్ పరీక్షా కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని 108 సిబ్బంది మహేష్ కుమార్, దుర్గయ్య ప్రథమ చికిత్స అందించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్ష రాయాల్సిన విద్యార్థులు ప్రమాదానికి గురవ్వడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News March 13, 2026
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్: కలెక్టర్

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జనరల్ ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 15 ఏళ్లలోపు బాలికలందరికీ జనరల్, ఏరియా ఆసుపత్రుల్లో ఈ టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు.


