News December 14, 2025
కామారెడ్డి జిల్లాలో 20.96% పోలింగ్

కామారెడ్డి జిల్లాల్లో రెండవ విడత ఎన్నికల్లో భాగంగా ఉ.9 గంటల వరకు 7 మండలాల్లోని నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
గాంధారి మండలంలో 27.74%,
లింగంపేట -9.94%
మహమ్మద్ నగర్- 20.42
నాగిరెడ్డిపేట్-19.51%
నిజాంసాగర్- 24.85%
పిట్లం- 20.19%
ఎల్లారెడ్డి- 28.53%
పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News January 14, 2026
ఈ భోగి ఎంతో స్పెషల్.. మళ్లీ 2040 వరకు రాదు!

ఇవాళ మనం జరుపుకుంటున్న భోగి ఎంతో విశిష్టమైంది. నేడు షట్తిల ఏకాదశి. భోగి పండగ రోజు ఏకాదశి తిథి రావడమే దీని ప్రత్యేకత. ఇలా మళ్లీ 2040 వరకు జరగదు. షట్తిల ఏకాదశి రోజు నువ్వులు దానం చేయాలి. వీటితో పాటు బెల్లం, దుస్తులు, నెయ్యి, ఉప్పు, చెప్పులు, దుప్పట్లు దానమిస్తే మంచిది. ఇవాళ ఉపవాసం ఉంటే భగవంతుడి కృపతో కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.
News January 14, 2026
ములుగు: ఎర్రటి స్తూపం పచ్చగా మారింది!

ఒకప్పుడు విప్లవోద్యమంలో అమరులైన వారికి గుర్తుగా ఎర్రటి స్తూపాలను ఏర్పాటు చేశారు. పోలీసు నిర్బంధం సమయంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ స్తూపం వద్ద నివాళులర్పించేవాళ్లు. కాలక్రమంగా నక్సల్స్ అంతరించే దశకు చేరడంతో స్తూపాల దగ్గర స్తబ్ధత నెలకొంది. మేడారం జాతర సందర్భంగా కన్నెపల్లిలోని ఎర్రటి స్తూపాన్ని ఆదివాసీ అమరవీరులకు గుర్తుగా మార్చారు. వారి త్యాగాలకు సంకేతంగా ఆకుపచ్చని రంగులో స్తూపాన్ని మార్చారు.
News January 14, 2026
MBNR: ఆర్టీసీ బస్సు ప్రమాదం.. డ్రైవర్ వివరణ

జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద జరిగిన ఆర్టీసీ <<18851918>>బస్సు ప్రమాదానికి<<>> గల కారణాలను ఆర్టీసీ డ్రైవర్ కార్తీక్ వెల్లడించారు. HYD నుంచి కర్నూలుకు వెళ్తుండగా రాత్రి 1 గంటకు డీసీఎం వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేయడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలోని బస్సులో ఉన్న 25 ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది MBNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


