News December 14, 2025
నిజామాబాద్ జిల్లాలో 20.49 శాతం పోలింగ్

రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మొదలైన రెండు గంటల్లో ఉదయం 9 గంటల వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1081WM లకు 20.49 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
*ధర్పల్లి మండలంలో 20.99%,
*డిచ్పల్లి -13.52%
*ఇందల్ వాయి- 19.95%
*జక్రాన్ పల్లి- 23%
*మాక్లూర్-22.31%
*మోపాల్- 19.43%
*NZB రూరల్- 26.69%
*సిరికొండ-23.24% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.
Similar News
News January 11, 2026
నిజామాబాద్ జిల్లా పద్మశాలి కాలమానిని ఆవిష్కరణ

పద్మశాలి భవనంలో పద్మశాలి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాలమానిని – 2026ను సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చౌకే వరప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఐక్యతకు, సంక్షేమానికి సంఘం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆసమ్ నవీన్, కోశాధికారి బాస దేవిదాస్, భూమేశ్వర్, రుద్ర గణపతి, భోజదాస్ పాల్గొన్నారు.
News January 11, 2026
ఆర్మూర్: దంపతుల ఆత్మహత్యాయత్నం

ఆర్మూర్ శివారులో శనివారం సాయంత్రం దంపతులు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం పడిగేలా గ్రామం వడ్డెర కాలనికి చెందిన రవితేజ, భార్య శోభ పట్టణ శివారులోని ఓ వెంచర్‌లో విషం తాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
News January 11, 2026
NZBకు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాక

TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. ఉదయం 8 గంటలకు HYD నార్సింగి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.30కు NZB చేరుకుంటారు. 12 గంటలకు స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు R&B గెస్ట్ హౌస్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి నిజామాబాద్‌లో బస చేసి సోమవారం ఉదయం 11 గంటలకు వరంగల్ బయలుదేరి వెళ్తారు.


