News December 14, 2025
సంగారెడ్డి జిల్లాలో 9 AM @ 24.66 శాతం పోలింగ్

సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో ఆదివారం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఉ.9 గంటల వరకు పోలింగ్ శాతాన్ని అధికారులు ప్రకటించారు. మొత్తం 2,99,578 ఓట్లకు గాను 73,871 ఓట్లు పోలయ్యాయి. 24.66 శాతం ఓటింగ్ నమోదైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News January 13, 2026
TCSలో మరిన్ని ఉద్యోగాల కోత!

TCSలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. 6 నెలల్లో 30 వేల మందిని ఇంటికి పంపిన కంపెనీ అవసరమైతే మరింత మందిని తీసేస్తామని చెప్పింది. ‘నంబర్ ఇంత అని నిర్ణయించలేదు. కానీ వచ్చే త్రైమాసికంలోనూ తొలగింపులు ఉంటాయి. సరైన కారణం, అంతర్గత ఆడిట్ ద్వారానే ఇవి జరుగుతాయి’ అని తెలిపింది. ప్రస్తుతం TCSలో 5,82,163 మంది పని చేస్తున్నారు. సెప్టెంబర్ క్వార్టర్‌లో 19,755 మంది, డిసెంబర్ క్వార్టర్‌లో 11,151 మందిని తీసేసింది.
News January 13, 2026
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రజలు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటిల్లిపాది సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లకుండా భోగి, మకర సంక్రాంతి, కనుమను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
News January 13, 2026
సంగారెడ్డి: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కలెక్టర్

సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు కొనసాగుతున్నందున రాబోయే వేసవిలో జిల్లాలో మంచినీటి సమస్య లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 20 నుంచి 29 వరకు ఖేడ్ నియోజకవర్గంలో వాటర్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. మిగతా చోట్ల ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు చేయాలని తెలిపారు.


