News December 14, 2025
మెట్‌పల్లి: లండన్‌లో సివిల్ ఇంజనీర్ చదువు.. నేడు ఉప సర్పంచ్

మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి వార్డు మెంబర్‌గా పోటీ చేసి విజయం సాధించిన ఆకుల రాకేష్ (30)కు ఉప సర్పంచ్ పదవి వరించింది. లండన్‌లో సివిల్ ఇంజనీర్ చదివిన రాకేష్ స్వగ్రామ అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలోనే ఉప సర్పంచ్ పదవిని అలంకరించారు.
Similar News
News January 13, 2026
ముగ్గులతో ఆరోగ్యం..

సంక్రాంతి నెల వచ్చిందంటే చాలు ముగ్గులూ వాటి మీద ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు కనువిందు చేస్తుంటాయి. హేమంతరుతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులేయడం, గొబ్బెమ్మలను పెట్టడం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది.
News January 13, 2026
ముగ్గు వేస్తే ఆరోగ్యం..

ఉదయాన్నే ముగ్గు వేస్తే మహిళలకు వ్యాయామం అవుతుంది. ఇది వెన్నెముకను దృఢపరుస్తుంది. జీర్ణక్రియను, పునరుత్పత్తి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్ల కదలికల వల్ల శరీరానికి చక్కని మసాజ్ అందుతుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. బియ్యప్పిండితో ముగ్గు వేస్తే చీమలు, పిచ్చుకల వంటి జీవులకు ఆహారం లభిస్తుంది. ఈ ప్రాసెస్ ఏకాగ్రతను పెంచే ఒక అద్భుతమైన మెడిటేషన్ వంటిది.
News January 13, 2026
విశాఖ: ఆ ప్యాసింజర్ గంటన్నర ఆలస్యం

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ -భవానిపట్నం ట్రైన్ నెంబర్ (58504) పాసింజర్ రైలు సమయం మార్పు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ 1:30 పాటు ఆలస్యంగా 7:30 గంటలకు బయలుదేరుతుందని ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించవలసిందిగా రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ట్రైన్ విజయనగరం, బొబ్బిలి , రాయగడ మీదుగా భవానిపట్నం చేరుతుంది.


