News April 20, 2024
బంటుమిల్లిలో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

మండలంలోని నెహ్రూ నగర్‌లో అభం శుభం తెలియని 8ఏళ్ల బాలికపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన ఉపాధ్యాయుడు రామానంద సాగర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 11, 2025
చల్లపల్లి: పాఠశాల అన్నంలో పురుగులు

చల్లపల్లి (M) పురిటిగడ్డ ZP హైస్కూల్‌లో బుధవారం మధ్యాహ్నం విద్యార్థుల కోసం వండిన అన్నంలో పురుగులు కనిపించాయి. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే HM కె.బి.ఎన్ శర్మ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి, బియ్యాన్ని జల్లించి శుభ్రం చేయించి వండించారు. వండిన అన్నం నాణ్యతను స్వయంగా పరిశీలించి, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
News September 10, 2025
కృష్ణా: ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో SP సమావేశం

ఎస్పీ ఆర్. గంగాధరరావు ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం బుధవారం నిర్వహించారు. పోలీస్ సూచనల ప్రకారం వివాదాస్పద, వ్యక్తిగత దూషణల ఫ్లెక్సీలు ముద్రించకూడదని, ఆర్డర్ ఇచ్చిన వారి పూర్తి వివరాలు నమోదు చేయాలిని సూచించారు. అసోసియేషన్ సభ్యులు చట్టపరంగా సహకరించి సమాజ శాంతికి కృషి చేయమని ప్రతిజ్ఞ చేసుకున్నారు.
News September 10, 2025
కృష్ణా జిల్లా టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా: యూరియా పంపిణీని పరిశీలించిన కలెక్టర్.
☞ విజయవాడలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్.
☞ కృష్ణా: పట్టిసీమకు పదేళ్లు పూర్తి.
☞ కృష్ణా జిల్లాలో ముగ్గురు ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా ప్రమోషన్.
☞ కృష్ణా: 11,12 తేదీల్లో కళా ఉత్సవ్ పోటీలు.
☞ కృష్ణా జిల్లా రైళ్లకు కొత్త స్టాపులు.
☞ విజయవాడలో ఈనెల 26న భారీ ఈవెంట్ ప్లాన్.
☞ కృష్ణా: రీవాల్యూషన్ నోటిఫికేషన్ విడుదల.