News December 14, 2025

బిగ్‌బాస్-9.. భరణి ఎలిమినేట్!

image

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న విషయం తెలిసిందే. నిన్న అంతా ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇవాళ భరణి ఎలిమినేట్ కానున్నారని SMలో పోస్టులు వైరలవుతున్నాయి. అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన టాప్-5కి చేరుకుంటారు.

Similar News

News January 8, 2026

అసెంబ్లీకి రాని వైసీపీ MLAలకు నోటీసులు!

image

AP: అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న YCP MLAలపై ఎథిక్స్ కమిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై సమావేశమైన కమిటీ సభ్యులు సభకు రాకపోయినా జీతాలు, టీఏ, డీఏలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందుగా వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. నిపుణుల అభిప్రాయాలు, ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని కమిటీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు.

News January 8, 2026

వామ్మో.. నాటుకోడి కేజీ రూ.2,500

image

AP: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గ్రామ దేవతలకు మొక్కులు తీర్చడంతోపాటు అతిథులకు నాటుకోడి వంటకాలు పెట్టడం ఆనవాయితీ. దీంతో కేజీ కోడి ధర రూ.2,000-2,500(గతంలో రూ.1,000-1,200) పలుకుతోంది. వైరస్‌ల కారణంగా నాటుకోళ్లను పెంచే వారి సంఖ్య తగ్గిపోవడంతో కొరత ఏర్పడింది. ఇదే అదునుగా యజమానులు రేట్లు భారీగా పెంచేశారు. అటు బ్రాయిలర్ చికెన్ రేటు కూడా రూ.300-350 పలుకుతోంది.

News January 8, 2026

చలి పంజా.. జి.మాడుగులలో 2.7 డిగ్రీలు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. నిన్న ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 2.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదే. అటు TGలోని ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 7.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత పెరగనుందని IMD తెలిపింది. ADB, నిర్మల్, ASFB, మంచిర్యాల, MDK, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.