News December 14, 2025
మహబూబాబాద్: @11AM.. 1,18,708 ఓట్లు నమోదు

మహబూబాబాద్ జిల్లాలో రెండో విడతలోని 7 మండలాల్లో ఉదయం 11 గంటల వరకు 1,18,708 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా… బయ్యారంలో 21,210, చిన్నగూడూరులో 7,411, దంతాలపల్లిలో 17,297, గార్లలో 15,559, నరసింహులపేటలో 15,722, పెద్దవంగరలో 14,911, తొర్రూరులో 26,598 ఓట్లు నమోదయ్యాయి. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Similar News
News December 16, 2025
బేబీ వెయిట్ పెరగడానికి ఏం చేయాలంటే?

గర్భంలో పిండం బరువు ఎందుకు పెరగట్లేదో ముందుగా తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బేబీ ఊపిరితిత్తులు సరిగా లేకపోతే ఇంజక్షన్లు తీసుకోవడం తప్పనిసరి. డాక్టర్లు సూచించిన స్కాన్‌లు ఎప్పటికప్పుడు చేసుకుంటూనే వేరుశెనగలు, రాజ్మా, మిల్క్, ఎగ్స్, మాంసం, పప్పులు, పనీర్ వంటి ప్రొటీన్ రిచ్ ఫుడ్స్, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
News December 16, 2025
ఆరోగ్యం కోసం కుంకుమ పెట్టుకుందామా?

పసుపుతో తయారయ్యే కుంకుమ సహజంగా క్రిమి సంహారినిగా పనిచేసి మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. కుంకుమలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి మెరుపు తీసుకువస్తాయి. అలాగే డెడ్ సెల్స్‌ను పోరాడతాయి. కుంకుమ అనేక చర్మ సంబంధిత వ్యాధులను, చికాకులను దూరం చేస్తుంది. నుదిటిపై కుంకుమ ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది.
News December 16, 2025
KNR: క్లైమాక్స్‌కు పల్లె సమరం.. రేసులో 1580 మంది

పల్లె సమరం తుదిదశకు చేరుకుంది. మూడో విడత పోలింగ్‌లో 1580మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. KNRలో 111 GPల్లో 3 ఏకగ్రీవం కాగా 108 స్థానాల్లో పోటీకి 451మంది బరిలో నిలిచారు. సిరిసిల్లలో 87 GPలకు 7 ఏకగ్రీవం కాగా 80 స్థానాలకు 379మంది, జగిత్యాలలో 119 GPల్లో 6 ఏకగ్రీవం కాగా 113 స్థానాలకు 456మంది పోటీ పడుతున్నారు. పెద్దపల్లిలో 91 GPల్లో 6 ఏకగ్రీవం కాగా 85 స్థానాలకు 294మంది రేసులో ఉన్నారు.


