News December 14, 2025

నర్సాపూర్‌కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

image

చెన్నై–విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్‌లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉదయం 5.30కి బయలుదేరే ఈ రైలు ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.

Similar News

News December 16, 2025

ప్రకాశం జిల్లాకు జోన్-4 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో ప్రకాశం జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-4గా చోటుదక్కింది.

News December 16, 2025

ప్రకాశం: పరారైన ఖైదీ.. 24 గంటల్లో పట్టుబడ్డాడు

image

ఒంగోలు బస్టాండ్ నుంచి ఎస్కార్ట్ కళ్లుగప్పి పరారైన ఖైదీని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జైలు నుంచి వైజాగ్‌కు ఇరువురు నిందితులను తీసుకువెళ్తుండగా ఒంగోలు బస్టాండ్ వద్దకు ఆదివారం రాత్రి ఎస్కార్ట్ పోలీసులు చేరుకున్నారు. అక్కడ వారి కళ్లుగప్పి శ్రీనివాసరావు అనే నిందితుడు పారిపోయాడు. కాగా ఒంగోలు వన్‌టౌన్ PSలో ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.

News December 16, 2025

ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలి: ప్రకాశం కలెక్టర్

image

ఈనెల 17,18 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సమీక్షా సమావేశానికి అవసరమైన ప్రగతి నివేదికలను సిద్ధంచేయాలని జిల్లా కలెక్టర్ రాజబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ల సమావేశానికి అవసరమైన నివేదికలగురించి జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి పూర్తిగా నివేదిక రూపంలో ఇవ్వాలన్నారు.