News April 20, 2024
గులకరాయి డ్రామా, గూడుపుఠాణిని బయటపెడతాం: అచ్చెన్నాయుడు

AP: తమ పార్టీ అధికారంలోకి రాగానే గులకరాయి డ్రామా, గూడుపుఠాణిని బయటపెడతామని TDP నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఈ డ్రామాకు దర్శకత్వం వహించిన వారికి తగిన రీతిలో సన్మానం చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో బోండా ఉమను కావాలనే వేధిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ సీపీ తీరుపై ఈసీ విచారణకు ఆదేశించాలన్నారు. CM జగన్ ప్లాన్ ప్రకారమే రాయి దాడి చేయించుకున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.
Similar News
News March 24, 2026
యుద్ధం.. ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన తొలి దేశం

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రపంచంలో ఇలా ప్రకటించిన తొలి దేశంగా నిలిచింది. ఇంధన భద్రత, పెరుగుతున్న విద్యుత్ ధరల నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలిపారు. ఎమర్జెన్సీ ఏడాదిపాటు కొనసాగే అవకాశం ఉంది. ఫిలిప్పీన్స్ దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌లో 98% పర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుండటం గమనార్హం.
News March 24, 2026
హార్ముజ్‌ను తెరిచి ఉంచడం అత్యవసరం: మోదీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి తనకు <<19466723>>కాల్<<>> వచ్చినట్లు PM మోదీ వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఇస్తుందని చెప్పారు. హార్ముజ్ జలసంధిని తెరిచి, అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరం అని పేర్కొన్నారు. శాంతి, స్థిరత్వం దిశగా జరుగుతున్న ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగిస్తామన్నారు.
News March 24, 2026
IPL: రహానేకు అతి తక్కువ జీతం..

IPL- 2026లో జీతాల పరంగా కెప్టెన్ల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. LSG కెప్టెన్ పంత్ ₹27 కోట్లతో అత్యధిక జీతం తీసుకుంటున్న ఆటగాడిగా రికార్డు సృష్టించారు. మరోవైపు KKR కెప్టెన్ అజింక్యా రహానే ₹1.5 కోట్లు మాత్రమే అందుకుంటున్నారు. ఈ సీజన్‌లో అత్యంత తక్కువ జీతం తీసుకుంటున్న సారథి ఈయనే. కాస్ట్లీ ప్లేయర్ల కంటే అనుభవానికే KKR ప్రాధాన్యం ఇవ్వగా.. ఈ ‘లో బడ్జెట్’ కెప్టెన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.


