News December 14, 2025
VZM: రెచ్చిపోయిన దొంగలు.. ఒకేసారి 5 ఆలయాల్లో చోరీ

వేపాడ మండలం బానాదిలో శనివారం రాత్రి 5 దేవాలయాల్లోని హుండీలో సొమ్మును దొంగలు అపహరించినట్లు SI సుదర్శన్ తెలిపారు. శివాలయం, వినాయకుడు, హనుమాన్, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో హుండీలను పగలగొట్టి సొమ్ము దొంగలించినట్లు వెల్లడించారు. దొంగలించిన సోమ్ము సుమారు రూ.41 వేలు ఉంటుందన్నారు. క్లూస్ టీమ్‌తో తనిఖీలు నిర్వహించారు. అర్చకుడు కిషోర్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.
Similar News
News March 23, 2026
VZM: పోలీస్ కార్యాలయానికి 37 ఫిర్యాదులు

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత మొత్తం 37 ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలపై సానుకూలంగా స్పందించాలని, చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 7 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

VZM: క్షయ నిర్మూలనకు ‘వందరోజుల కార్యక్రమం’ ప్రారంభం

జిల్లాలో క్షయ (టీబీ) వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ‘క్షయ వందరోజుల కార్యక్రమం’ను అమలు చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ జీవన రాణి తెలిపారు. సోమవారం కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ..ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ముందస్తు గుర్తింపు, సమయానికి చికిత్స ద్వారా వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.