News April 20, 2024
రేపు ‘కల్కి’ రిలీజ్ డేట్ రివీల్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై ఓ క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నెల 21న ఓ సాలిడ్ గ్లింప్స్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Similar News
News January 27, 2026
ఇంటర్వ్యూతో ESIC ఫరీదాబాద్‌లో 50 పోస్టులు

<
News January 27, 2026
ఒకే రోజు రూ.63 కోట్ల కలెక్షన్లు

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బార్డర్-2’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. నిన్న ఒక్క రోజే ఈ మూవీకి రూ.63 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ తెలిపారు. మొత్తంగా నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.193.48 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని పేర్కొన్నారు. అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషించారు.
News January 27, 2026
మోదీ ట్వీట్.. వివాదాస్పదంగా అనువదించిన గ్రోక్

మాల్దీవ్స్‌కు థాంక్స్ చెబుతూ PM మోదీ చేసిన ట్వీట్‌ను <<18752905>>‘గ్రోక్’<<>> తప్పుగా అనువదించింది. ‘రిపబ్లిక్ డే వేడుకలు మాల్దీవ్స్‌లో జరిగాయి. ఈ సుకురియా ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటోంది. భారత వ్యతిరేక ప్రచారాల్లో ముందుంది’ అన్నట్లు ట్రాన్స్‌లేట్ చేసింది. నిజానికి మోదీ 2 దేశాల ప్రయోజనాల కోసం కలిసి పని చేద్దామని, మాల్దీవుల ప్రజలందరికీ శ్రేయస్సు, ఆనందంతో నిండిన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.


