News December 14, 2025

మెదక్: పోలింగ్ ముగిసింది.. ఫలితం కోసం ఎదురుచూపు

image

మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత పక్షం రోజులుగా అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చేయ ప్రయత్నం లేదు. ఈసారి ఎన్నికల్లో డబ్బు, మద్యం, బాండ్ పేపర్ హామీలు కీలకంగా మారాయి. కొన్ని పంచాయతీలలో అభ్యర్థులు లక్షల రూపాయలు నీళ్లలా ఖర్చు చేశారు. మరి కొన్ని గంటల్లో ఫలితం తేలనుంది.

Similar News

News January 15, 2026

పీహెచ్‌సీలల్లో మందుల కొరత ఉండొద్దు: మెదక్ కలెక్టర్

image

పీహెచ్‌సీలల్లో అన్ని రకాల మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల గది, రికార్డులు, హాజరు పట్టికని పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని, అన్ని పరీక్షలు, మందులు నాణ్యతతో ఉచితంగా అందించాలని సూచించారు.

News January 15, 2026

యోగాసన పోటీల్లో మెదక్ క్రీడాకారుల ప్రతిభ

image

అస్మిత సౌత్ జోన్ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో మెదక్ జిల్లా చేగుంటకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ నాచారం డీపీఎస్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 350 మందికి పైగా పాల్గొన్నారు. రిత్మిక్ పెయిర్ విభాగంలో సైనీ శిరీష, చిక్కుల మనోజ నాలుగో స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందారు. వారు త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయ అస్మిత యోగాసన పోటీల్లో పాల్గొననున్నారు.

News January 15, 2026

మెదక్: రిజర్వేషన్ల ఖరారుతో ఆశావహుల్లో టెన్షన్!

image

మెదక్ జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వార్డు స్థానాల రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ వేడి రాజుకుంది. తమ స్థానం ఏ రిజర్వేషన్‌కు కేటాయిస్తారోనని ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఈసారి పుర పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది. రిజర్వేషన్ల లెక్కలను బట్టి అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.