News April 20, 2024

‘గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతాం’

image

అధికారంలోకి రాగానే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇవాళ గూడూరులోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా కేంద్రానికి వెళ్లడం ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ తెలపడంతో ఆయన ఈ హామీ ఇచ్చారు.

Similar News

News March 20, 2026

నెల్లూరు: గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు

image

నెల్లూరు రూరల్ అక్కచెరువుపాడు మైనార్టీ బాలురు గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు https://aprs.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఏప్రిల్ 24వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు.

News March 20, 2026

నెల్లూరు: పెళ్లికి వెళ్తుండగా యాక్సిడెంట్.. ఒకరి స్పాట్ డెడ్

image

బైకును కంటైనర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన మనుబోలు హైవేపై చోటుచేసుకుంది. ఎస్సై శివ రాకేశ్ కథనం మేరకు.. కలువాయికి చెందిన శెట్టి పల్లి రమేశ్ (40) బైక్‌పై మల్లాంలో జరగబోయే వివాహానికి వెళుతుండగా చెన్నై వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొంది. ఈప్రమాదంలో రమేశ్ అక్కడక్కడే మృతి చెందాడు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 20, 2026

నెల్లూరు: 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2కు వాయిదా

image

పదో తరగతి పరీక్షలులో భాగంగా శనివారం 21వ తేదీన జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడినట్లు ఉదయగిరి ప్రాంత పరీక్షల నిర్వహకులు తోట శ్రీనివాసులు ఒక ప్రకటన తెలిపారు. 21వ తేదీన ఈద్ – ఉల్ – ఫితర్ (రంజాన్ ) పర్వదినం రావడంతో ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.