News December 14, 2025

83.80 శాతం పోలింగ్ నమోదు

image

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 8 మండలాల్లో 139 పంచాయతీల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ సమయం ఒంటి గంట ముగిసే సరికి 83.80 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికార వర్గాలు వెల్లడించారు. ఆయా మండలాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచారు.

Similar News

News March 5, 2026

ప్రజాపాలనతోనే అభివృద్ధి: ADB కలెక్టర్

image

ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జెడ్పీ హాల్‌లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలు తీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 5, 2026

ADB: ఇంటర్ పరీక్షకు 473 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 8123 మంది విద్యార్థులకు గాను 7650 మంది హాజరయ్యారని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 7104 విద్యార్థులకు గాను 348 మంది, ఒకేషనల్ విభాగంలో 1019.విద్యార్థులకు గాను 125 మంది కలిపి మొత్తం 473 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

News March 4, 2026

ADB కలెక్టర్ క్యాంపు ఆఫీసులో హోలీ వేడుకలు

image

ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కలెక్టర్ రాజర్షిషా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పాల్గొని ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎస్పీ కార్పొరేషన్ ఈడి మనోహర్, సంక్షేమ అధికారి మిల్కా, డిపిఓ రమేష్, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పిడి రాజు ఉన్నారు.