News December 14, 2025
VKBలో 78.31 శాతం పోలింగ్ నమోదు

వికారాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఒంటి గంట వరకు 78.31 పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం వికారాబాద్ డివిజన్‌లో ఏడు మండలాల్లో కొనసాగుతున్న పోలింగ్‌లో 1 గంటల వరకు 78.31 పోలింగ్ నమోదు కాగా 2,09,847 మంది ఓటర్లకు 1,64,330 మంది ఓటర్లు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా అక్కడ ఓటు వేసేందుకు క్యూ లైన్‌లో ఓటర్లు ఉన్నారు. పూర్తి వివరాలు తరువాత వెల్లడించనున్నారు.
Similar News
News December 16, 2025
‘మిస్ ఆంధ్ర’ రన్నరప్‌గా అమలాపురం కమిషనర్ కుమార్తె

అమలాపురం మున్సిపల్ కమిషనర్ కుమార్తె వడాలశెట్టి కోమల సాయి అక్షయ ‘మిస్ ఆంధ్ర’ రన్నరప్‌గా నిలిచారు. విజయవాడలో ఈనెల 12న నిర్వహించిన రాష్ట్ర స్థాయి అందాల పోటీల్లో ఆమె ఈ ఘనత సాధించినట్లు కమిషనర్ సోమవారం తెలిపారు. అక్షయ ప్రస్తుతం బీబీఏ ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఆన్‌లైన్ ఆడిషన్స్‌లో ఎంపికై, తుది పోటీల్లో సత్తా చాటిన అక్షయను పలువురు అభినందించారు.
News December 16, 2025
నెల్లూరు: రైలు కిందపడి వ్యక్తి మృతి

రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి నెల్లూరు విజయమహల్ వద్ద జరిగింది. విజయవాడ వైపు వెళ్లే గుర్తు తెలియని రైలులో నుంచి గుర్తు తెలియని వ్యక్తి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందినట్లు నెల్లూరు రైల్వే SI హరిచందన తెలిపారు. అతడు ఎరుపు రంగు ఆఫ్ హాండ్స్ టీ షర్టు, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని, వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుందన్నారు.
News December 16, 2025
అనకాపల్లి: పీఆర్ ఉద్యోగుల జడ్పీ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవం

ఏపీ పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జడ్పీ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి, నక్కపల్లి మండల పరిషత్ ఏఓ సీతారామరాజు తెలిపారు. సోమవారం జెడ్పీ ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో యూనిట్ ప్రెసిడెంట్‌గా పీవీవీఎన్ మూర్తి, అసోసియేట్ అధ్యక్షురాలుగా ఎన్.రాజేశ్వరి ఎన్నికైనట్లు తెలిపారు. కార్యదర్శిగా నాగరాజు, కోశాధికారిగా లోవతల్లిని ఎన్నుకున్నారన్నారు.


