News December 14, 2025

గద్వాల: నాలుగు మండలాల్లో 95,592 ఓట్లు నమోదు

image

గద్వాల జిల్లాలో 2వ విడతలో ఎన్నికలు జరిగిన 4 మండలాల్లో 1,12,087 మంది ఓటర్లు ఉండగా 95,592 మంది ఓటు వేశారు. అయిజ మండలంలో 39,377 మంది ఓటర్లకు 32,563 మంది, మల్దకల్ మండలంలో 37,915 మంది ఓటర్లకు 30,548 మంది, వడ్డేపల్లి మండలంలో 7,477 మంది ఓటర్లు ఉండగా 6,442 మంది, రాజోలి మండలంలో 28,038 మంది ఓటర్లకు 23,039 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Similar News

News January 10, 2026

NHIDCLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>NHIDCL<<>>లో 64 అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (JAN 12) ఆఖరు తేదీ. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com

News January 10, 2026

యాక్సిడెంట్.. కడప యువకుడి మృతి

image

కదిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా లింగాలలోని రామట్ల పల్లికి చెందిన అశోక్ (26) మృతి చెందాడు. బెంగళూరుకు బైకులో వెళుతుండగా మార్గమధ్యంలో డివైడర్‌ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో మృతుని కటుంబంలో విషాదం అలుముకుంది.

News January 10, 2026

HYD: మాదాపూర్‌లో విషాదం.. యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక సమస్యలు తాళలేక ఓ యువ ఆర్కిటెక్ట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన అనుదీప్ ఓ ప్రైవేట్ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.