News December 14, 2025
కొత్తవలస: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొత్తవలస (M) తుమ్మకాపల్లి ఫైర్ స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లశంకర్రావు (52) మృతి చెందాడు. వేపాడ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గొల్ల దారప్పడు, గొల్ల శంకర్రావు ద్విచక్ర వాహనంపై పిల్లలతో విశాఖ బీచ్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో శంకర్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన దారప్పడును KGHకి తరలించారు. పిల్లలు భవాని, శంకర్ గాయపడ్డారు.
Similar News
News January 3, 2026
VZM: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

AP KGBV ఔట్‌సోర్సింగ్‌లో 1095 పోస్టులకు <
News January 3, 2026
బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష: VZM SP

బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి కోర్టు కఠిన కారాగార శిక్షను విధించినట్లు SP దామోదర్ శుక్రవారం తెలిపారు. బాడంగి (M)కి చెందిన V.వెంకటరమణ అదే ప్రాంతానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో 2024 డిసెంబర్‌లో పోక్సో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
News January 3, 2026
గరుడుబిల్లిలో పాఠశాలలను తనిఖీ చేసిన : DEO

బొండపల్లి మండలం గరుడబిల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదోవ తరగతి విద్యార్థులకు అమలు పరుస్తున్న 100 రోజుల ప్రణాళిక నిర్వహణ, విద్యార్థి ప్రతిభ పరిశీలన చేసి ప్రతి విద్యార్థి సైనింగ్ స్టార్‌గా మార్చేందుకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.


