News December 14, 2025
ఇంద్రానగర్ సర్పంచ్‌గా చిట్యాల దేవేంద్ర విజయం

తంగళ్ళపల్లి మండలం ఇంద్రానగర్ గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చిట్యాల దేవేంద్ర ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి దొగ్గల పద్మపై దేవేంద్ర గెలుపొందారు. ఈ సందర్భంగా దేవేంద్ర మాట్లాడుతూ.. ఈ గెలుపు తన వ్యక్తిగత విజయంగా కాకుండా ఇంద్రానగర్ గ్రామ ప్రజలందరి విజయంగా భావిస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించిన గ్రామస్థులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 7, 2026
NZB: బార్ ఎన్నికల అధికారుల నియామాకం

నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2026-27 వార్షిక ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా సీనియర్ న్యాయవాదులు ఆమీదాల సుదర్శన్, మెట్టు నరేశ్ కుమార్‌లను నియమించినట్లు బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్, నామినేష్ల ప్రక్రియకు సంబంధించి వివరాలు ఎన్నికల అధికారులు తెలియజేస్తారని వారు పేర్కొన్నారు.
News March 7, 2026
మృత్యుంజయ స్వామిని దర్శించుకున్న జడ్జి అరుణ

చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక శనివారం చౌడేపల్లి మండలంలోని పలు దేవాలయాలను సందర్శించారు. తొలుత స్థానిక శివాలయంలో మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన బోయకొండ గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. శివాలయంలో అర్చకులు, బోయకొండలో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం న్యాయమూర్తిని సాదరంగా ఆహ్వానించి స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు.
News March 7, 2026
‘విజయ’ బ్రాండ్‌తో కల్తీ.. AP డెయిరీపై ఆరోపణలు

TG: AP విజయ డెయిరీ తీరుపై తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అమిత్ రెడ్డి మండిపడ్డారు. అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలు ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి వస్తున్నాయని ఆరోపించారు. మేఘనా ఫుడ్స్ తయారు చేస్తున్న నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్ ఉన్నట్లు తెలిపారు. దీనివల్ల తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. AP ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.


