News December 14, 2025

RR: ఆమనగల్లు(M) శంకరకొండ సర్పంచ్‌‌గా రాములు

image

ఆమనగల్లు మండల పరిధిలోని 12 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శంకరకొండ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన రాములు 101 ఓట్లతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Similar News

News March 4, 2026

RR: నిఘా నీడలో పరీక్షలు.. 1,916 మంది డుమ్మా

image

నిఘా నీడలో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు బుధవారం ఇంటర్ 2nd ఇయర్ పరీక్ష జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 80,463 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 78,547 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,916 మంది విద్యార్థులు వివిధ కారణాలతో హాజరు కాలేకపోయారు.

News March 3, 2026

రంగారెడ్డి జిల్లాలో ప్రధాన ఆలయాలు మూసివేత

image

పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని ప్రధాన ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఫరూఖ్‌నగర్ మండంలోని ఉత్తరరామలింగేశ్వ రస్వామి, ఎలికట్ట అంబాభవానీ ఆలయాలు, చేవెళ్లలోని వేంకటేశ్వర ఆలయం, కడ్తాల్ మం.లోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయం, నర్కుడలోని అమ్మపల్లి ఆలయ ద్వారాలు మూసివేశారు. గ్రహణం పూర్తయిన అనంతరం శుద్ధి చేసి తెరుస్తామన్నారు.

News March 2, 2026

RR: ప్రజావాణికి 51 ఫిర్యాదులు: కలెక్టర్

image

రంగారెడ్డిలో కలక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణికి 51 ఫిర్యాదులు అందాయని, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.