News December 14, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే..!

బిజినేపల్లి మండలంలోని చిన్న పీర్ తాండా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు మునీందర్ నాయక్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి నూర్యపై ఆయన 70 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండలంలోని 35 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మునీందర్ నాయక్ గెలుపు పట్ల తాండా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News April 15, 2026
గుర్తుపెట్టుకోండి.. ‘అతి వినయం ధూర్త లక్షణం’

సహజ విరుద్ధంగా ఎవరి పట్లయినా అధిక వినయం, గౌరవాన్ని ప్రదర్శించేవారిని ప్రస్తావించేటప్పుడు ఈ సూక్తిని వాడతాం. పంచతంత్ర కథలు, చాణక్య నీతి కథల నుంచి ఇది వచ్చింది. వినయంగా ఉండటం మంచిదే. కానీ దాన్ని అతిగా ప్రదర్శిస్తున్నారంటే నమ్మక ద్రోహానికి సంకేతం కావొచ్చు. తమ పనులు సాధించుకోవడానికి మోసగాళ్లు, స్వార్థపరులు ఇలా చేస్తారు. మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎదురయ్యారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>
News April 15, 2026
అబార్షన్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వనపర్తి జిల్లాలో అబార్షన్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కేసు వెనుక ఉన్న కారణాలు, చోటుచేసుకునే ప్రాంతాలపై సమగ్ర పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం గోపాలపేట మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈడీడీ డెలివరీ రిజిస్టర్లను పరిశీలించారు.
News April 15, 2026
పీజీఆర్ఎస్ అర్జీలకు వేగవంత పరిష్కారం: కలెక్టర్

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఏ.సిరి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ రోజు లాగిన్‌లో అర్జీలను పరిశీలించి, వెంటనే స్పందించాలని సూచించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించి సానుకూల స్పందన శాతాన్ని పెంచాలని తెలిపారు. జిల్లాలో 104 శాతం ఆదాయం సాధించడంపై ప్రశంసించారు.


