News December 14, 2025

BREAKING: మెదక్‌లో తొలి ఫలితం

image

మెదక్ మండలం బాలానగర్ సర్పంచ్‌గా బెండ వీణ విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి వీణ సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. వీణ మెదక్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామభివృద్ధికి కృషి చేస్తా అన్నారు.

Similar News

News March 11, 2026

ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలి: నల్గొండ ఎస్పీ

image

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులతో బుధవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. జిల్లాలో నేర నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

News March 11, 2026

NLR: సిలిండర్ల కొరత అంటూ ప్రచారం.. వాస్తవం ఇదే.!

image

జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని సంబంధిత శాఖ అధికారిని లీలారాణి తెలిపారు. జిల్లాలోని అన్ని అధీకృత LPG డిస్ట్రిబ్యూటర్ల వద్ద సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. సిలిండర్ల కొరత ఉందనే వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. ఎవరైనా డిస్ట్రిబ్యూటర్, ఏజెన్సీ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించడం, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

News March 11, 2026

రంప: భార్యను హత్య చేసిన కిరాతకుడు

image

దబ్బవలసకి చెందిన అబ్బాయిరెడ్డి అతని భార్య రామలక్ష్మి(26)ని కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామలక్ష్మి కనిపించడం లేదన్న తల్లి ఫిర్యాదుతో CI సన్యాసినాయుడు విచారణ జరిపి ఆమె మృతదేహాన్ని జీడిమామిడి తోటలో బుధవారం కనుగొన్నారు. 4రోజుల క్రితం జీడిమామిడి తోటలో పని చేయడానికి భార్యాభర్తలు వెళ్లగా.. తాగి ఉన్న భర్తతో ఆమె గొడవ పడింది. కర్రతో భర్త ఆమె తలపై కొట్టడంతో మృతి చెందింది.