News December 14, 2025

వనపర్తి జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే!

image

అమరచింత మండల పరిధిలోని అమరచింత ఆర్ఆర్ సెంటర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారురాలు విజయభారతి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి చిన్న మునిప్పపై ఆమె 90 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు గాను, 2 ఏకగ్రీవం కాగా, మిగిలిన 12 పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

Similar News

News April 11, 2026

సిద్దిపేట: ’18 మందికి రూ.1,83,500 జరిమానా’

image

సిద్దిపేటలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 18 మందిని పట్టుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా స్పెషల్ సెకండ్ క్లాస్ జుడీషియల్ మెజిస్ట్రేట్ రూ.1,83,500 జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ముగ్గురికి రూ.15వేలు జరిమానా విధించారు. డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదకరమని, నియమాలు పాటించాలని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ సూచించారు.

News April 11, 2026

ద్వారకాతిరుమల: 26 నుంచి శ్రీవారి వైశాఖమాస కళ్యాణోత్సవాలు

image

ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలను ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో భద్రాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం ఏప్రిల్ 30 గురువారం రాత్రి 8 గంటలకు, రథోత్సవం మే 1 శుక్రవారం రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు అన్ని సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామన్నారు.

News April 11, 2026

ఎల్లుండి రాష్ట్రపతితో మంత్రి లోకేశ్ భేటీ

image

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలపనున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న ఆయన సోమవారం కూటమి ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. అమరావతి ప్రాశస్త్యం, రాజధాని పనుల్లో పురోగతి తదితరాల గురించి తెలిపే బుక్‌ను ఈ సందర్భంగా రాష్ట్రపతికి అందజేయనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన అమరావతి బిల్లుపై గెజిట్ నోటిఫికేషన్ రిలీజైన విషయం తెలిసిందే.