News December 14, 2025
సూర్యాపేట: ఐదు ఓట్ల తేడాతో తొలి విజయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన రెండో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి హాజీ నాయక్ ఆదివారం గెలుపొందారు. కోదాడ మండలం కూచిపూడి తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆయన ప్రత్యర్థిపై 5 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు చెప్పారు. తన గెలుపునకు కృషి చేసిన వార్డు ఓటర్లకు నూతన సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 14, 2026
‘గూడెం’ బరిలో రూ.2 కోట్లు పైమాటే?

తాడేపల్లిగూడెం(M)లో కోడిపందేల నిర్వహణ ఉత్కంఠ రేపుతోంది. గతేడాది ఒకే బరిలో రూ.కోటికిపైగా పందెం జరగగా, ఈసారి అది రూ.2కోట్లు దాటుతుందని సమాచారం. దీంతో పందెం రాయుళ్లంతా ఈ బరిపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీసులు బరులను ధ్వంసం చేస్తున్నా, లక్షలాది రూపాయల చేతులు మారే ఈ భారీ పందెంపైనే సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
News January 14, 2026
‘ట్రంప్ ఎలా బతికున్నారో ఏంటో’.. ఆరోగ్యశాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్ జంక్ ఫుడ్ అలవాట్లపై ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ కెన్నడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరంతరం మెక్‌డొనాల్డ్స్ ఫుడ్, క్యాండీలు తింటూ డైట్ కోక్ తాగుతారని తెలిపారు. రోజంతా శరీరంలోకి విషాన్ని పంపిస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. ‘ఆయన ఇంకా ఎలా బతికున్నారో అర్థం కావడం లేదు’ అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ప్రయాణాల్లో కార్పొరేట్ కంపెనీల ఫుడ్‌నే నమ్ముతారని.. ఆయనకు దైవ సమానమైన శరీరతత్వం ఉందని చమత్కరించారు.
News January 14, 2026
పండుగ రోజున స్వీట్స్ ఎందుకు తింటారు?

సంక్రాంతి ఆరోగ్యప్రదాయిని. చలికాలంలో వచ్చే వాత సమస్యలను తగ్గించడానికి సకినాల్లో వాడే వాము, శరీరానికి వేడినిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నువ్వులు, బెల్లం కలిపి తినడం వల్ల ఐరన్, క్యాల్షియం సమృద్ధిగా అందుతాయి. దంపుడు బియ్యంతో చేసే పొంగలి, ఇన్‌స్టంట్ ఎనర్జీనిచ్చే చెరుకు, పోషకాలున్న గుమ్మడికాయ శరీరానికి బలాన్నిస్తాయి. ఇంటి ముంగిట పేడ నీళ్లు, మామిడాకులు బ్యాక్టీరియాను దూరం చేస్తాయి.


