News December 14, 2025
ములుగు: PHASE-2లో పెరిగిన పోలింగ్ శాతం

జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరిగిన 3 మండలాలతో పోల్చితే రెండవ విడత పోలింగ్ జరిగిన 3 మండలాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. మొదటి విడత మండలాలైన గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో 73.57% పోలింగ్ నమోదు కాగా, రెండో విడత మండలాలైనా వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి మండలాల్లో 81.53% పోలింగ్ నమోదయింది. పెరిగిన పోలింగ్ శాతం అధికార పార్టీ మద్దతు దారులకు అనుకూలమని విశ్లేషకులు అభిప్రాయం.
Similar News
News January 14, 2026
‘అక్కడ మహిళల్ని..’ DMK MP వివాదాస్పద వ్యాఖ్యలు

DMK MP దయానిధి మారన్ ఉత్తరాది మహిళలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. TNలో మహిళలను చదువుకోమని ప్రోత్సహిస్తుంటే.. ఉత్తరాదిలో మాత్రం వారిని ‘వంటగదికే పరిమితం చేస్తూ, పిల్లల్ని కనమని’ చెబుతున్నారని విమర్శించారు. ద్రవిడ మోడల్ వల్లే TN అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ వ్యాఖ్యలపై BJP తీవ్రంగా మండిపడింది. మారన్ ఉత్తరాది వారిని అవమానిస్తున్నారని.. ఆయనకు కనీస జ్ఞానం లేదని ధ్వజమెత్తింది.
News January 14, 2026
కాకినాడ: విషాద ‘భోగి’.. అగ్ని ప్రమాదంతో అగమ్యగోచరం..

రౌతులపూడి(M) సార్లంకపల్లెలో సంక్రాంతి సంబరాలు విషాదంలో మునిగిపోయాయి. సోమవారం జరిగిన <<18839258>>అగ్నిప్రమాదం<<>>లో ఇళ్లను కోల్పోయిన గిరిజన కుటుంబాలు, భోగి రోజున నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా, సర్వం కోల్పోయిన బాధలో మహిళలు ఏమి తోచని స్థితిలో ఉన్నారు. అందరూ సంబరాల్లో మునిగిపోగా, ఈ పల్లెలో మాత్రం బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి.
News January 14, 2026
త్వరలో రాష్ట్రంలో 10వేల పోస్టులకు నోటిఫికేషన్!

TG: రాష్ట్రంలో త్వరలో వైద్యారోగ్యశాఖలో 10వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇప్పటికే సీఎం రేవంత్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.


