News December 14, 2025
అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

AP: అనకాపల్లి సమీపంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC)ను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 3వేల ఎకరాల్లో ఈ కేంద్రం ఏర్పాటుకానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సేకరించిన భూమిని ఆనుకొని ఉన్న 148.15 హెక్టార్ల రెవెన్యూ భూమిని తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రక్షణపరంగా విశాఖ తీరం ఈ సెంటర్ ఏర్పాటుకు అనువైనదిగా భావించి కేంద్ర ప్రభుత్వం ఈ ఏరియాను ఎంపిక చేసింది.
Similar News
News December 16, 2025
బేబీ వెయిట్ పెరగడానికి ఏం చేయాలంటే?

గర్భంలో పిండం బరువు ఎందుకు పెరగట్లేదో ముందుగా తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బేబీ ఊపిరితిత్తులు సరిగా లేకపోతే ఇంజక్షన్లు తీసుకోవడం తప్పనిసరి. డాక్టర్లు సూచించిన స్కాన్‌లు ఎప్పటికప్పుడు చేసుకుంటూనే వేరుశెనగలు, రాజ్మా, మిల్క్, ఎగ్స్, మాంసం, పప్పులు, పనీర్ వంటి ప్రొటీన్ రిచ్ ఫుడ్స్, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
News December 16, 2025
ఆరోగ్యం కోసం కుంకుమ పెట్టుకుందామా?

పసుపుతో తయారయ్యే కుంకుమ సహజంగా క్రిమి సంహారినిగా పనిచేసి మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. కుంకుమలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి మెరుపు తీసుకువస్తాయి. అలాగే డెడ్ సెల్స్‌ను పోరాడతాయి. కుంకుమ అనేక చర్మ సంబంధిత వ్యాధులను, చికాకులను దూరం చేస్తుంది. నుదిటిపై కుంకుమ ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది.
News December 16, 2025
హైదరాబాద్ BDLలో 80 పోస్టులు

HYDలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)లో 80 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు DEC 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, MSc(కెమిస్ట్రీ), MBA, CA/ICWAI, PG డిప్లొమా, M.Com ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.40,000-రూ.1,40,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్:bdl-india.in


