News December 14, 2025
GNT: వరుసగా మూడోసారి మన జిల్లా టాప్

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొత్తం 431 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసి 3,04,212 కేసులను పరిష్కరించామని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. ఇందులో 5,985 సివిల్, 2,75,567 క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా సివిల్ కేసుల పరిష్కారంలో 23,466 కేసులతో గుంటూరు జిల్లా వరుసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచింది.
Similar News
News January 3, 2026
GNT: సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సీఎం చంద్రబాబు ఈ నెల 5న గుంటూరు రానున్న నేపథ్యంలో SP వకుల్ జిందాల్‌తో కలిసి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఏర్పాట్లు పరిశీలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు సీఎం విచ్చేయనున్నారు. శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News January 3, 2026
GNT: ప్రముఖులకు స్వాగతం పలికిన అధికారులు

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటమ్ శ్రీ నరసింహ, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు గుంటూరులో ఘన స్వాగతం లభించింది. శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు వారు విచ్చేశారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ అతిథులకు స్వాగతం పలికారు.
News January 3, 2026
GNT: పోలీసులకు స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది వారి బదిలీలు, సర్వీస్, వ్యక్తిగత సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందించారు. పోలీస్ శాఖ కుటుంబం లాంటిదని, క్రమశిక్షణ, సమయభావం పాటిస్తూ పరస్పరం అర్థం చేసుకుంటూ అడుగులు ముందుకు వేయాలని సూచించారు. సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.


