News December 14, 2025
రాయికోడ్: 4 ఓట్లతో WIN

రాయికోడ్ మండలంలో ఎన్కెపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌గా BRS బలపరిచిని అభ్యర్థి బేగరి ఈశ్వరమ్మ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మానమ్మా మీద 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే పార్టీ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
Similar News
News March 13, 2026
‘పారాక్వాట్ డైక్లోరైడ్’ గడ్డి మందును నిషేధించాలి: ఎంపీ వద్దిరాజు

“పారాక్వాట్ డైక్లోరైడ్”గడ్డి మందును నిషేధించాలని కోరుతూ కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వినతి పత్రం ఇచ్చారు. గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల వచ్చే అనర్థాల గురించి మంత్రికి వివరించారు. విషపూరితమైన ఈ గడ్డి మందును ఒక చుక్క మింగినా ప్రాణాలు పోతున్నాయన్నారు. దీనికి విరుగుడు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 70 దేశాలు ఈ మందులు నిషేదించాయని, ఇండియాలో కూడా నిషేధించాలని కోరారు.
News March 13, 2026
కృష్ణాజిల్లాలో రేపు సెలవు రద్దు

కృష్ణా జిల్లాలోని విద్యా సంస్థలకు ఈ నెల 14న రెండో శనివారం శెలవు రద్దు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు గురువారం తెలిపారు. మొంథా తుపాన్ సమయంలో కాంపస్ శాటరీ శెలవుల దృష్ట్యా ఈ శనివారం పాఠశాలలకు శెలవు దినం రద్దు చేసినట్లు వివరించారు. ఆ రోజు అన్ని విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని డీఈఓ కోరారు.
News March 13, 2026
గుంటూరు: ఈ నంబర్‌తో పోలీస్ సేవలు..!

గుంటూరు జిల్లా ప్రజలు మన మిత్ర – వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని సందేశం పంపితే FIR కాపీ, కేసు స్థితి, ఈ-చలానా వివరాలు వంటి పోలీస్ సేవలు మొబైల్‌లోనే పొందవచ్చన్నారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదులకు 1930, అత్యవసర పోలీస్ సహాయానికి 112 కు కాల్ చేయాలని సూచించారు.


