News December 14, 2025
అనకాపల్లి జిల్లా ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుందర్రావు

జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కె.సుందర్రావు (మాకవరపాలెం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం అనకాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షుడిగా ఆర్.గంగరాజు, కార్యదర్శిగా కె.ప్రేమ్ కుమార్, మహిళా కార్యదర్శిగా పీఆర్.కళ్యాణి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా బీ.ఉమారాణి, కోశాధికారిగా శ్రీనివాసరావు, జిల్లా కౌన్సిలర్‌గా స్వామి ఎన్నికయ్యారు.
Similar News
News January 21, 2026
ప.గో: ఉదయాన్నే ఫోన్ కాల్స్.. రెవెన్యూ ఉద్యోగుల ఉక్కిరిబిక్కిరి!

ఉమ్మడి ప.గో జిల్లా రెవెన్యూ అధికారులు టెలికాన్ఫరెన్స్ మీటింగ్‌లతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో నిమగ్నమైన తహసీల్దార్లకు ఉదయం 8 నుంచే ఆర్‌డీఓలు, జేసీల నుంచి సమీక్షా పిలుపులు వస్తున్నాయి. దీంతో వారు ప్రయాణంలోనూ ఫోన్లతోనే గడపాల్సి రావడంతో క్షేత్రస్థాయిలో పర్యటనలు ఆలస్యమవుతున్నాయి. పని ఒత్తిడి పెరిగి ప్రజా సమస్యల పరిష్కారం కుంటుపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News January 21, 2026
NGKL: మున్సిపల్ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న పార్టీ పోటీ

నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తున్నట్లు సమాచారం. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మునిసిపాలిటీలలోని అన్ని వార్డులలో పార్టీ అభ్యర్థులను నిలిపి వారికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు తీన్మార్ మల్లన్న ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
News January 21, 2026
జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పబ్లిక్ హెల్త్ కమిషనర్ అజయ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు సమయపాలన పాటించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలుమార్లు హెచ్చరించినా పనితీరు మారకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆయన ఆరా తీశారు.


