News December 14, 2025

గద్వాల్: 2,300 ఓట్ల భారీ మెజారిటీతో విజయం

image

అయిజ మండలం పులికల్ గ్రామం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాణిక్యమ్మ తన సమీప ప్రత్యర్థి మాల లక్ష్మీపై 2300 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అయిజ మండలం పులికల్ గ్రామంలో మొత్తం 3,607 ఓట్లు ఉండగా మాణిక్యమ్మ 2300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం మండలంలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఈమె అత్యధిక మెజారిటీ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

Similar News

News January 13, 2026

‘విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదు’

image

రబీ 2025–26 పంట కాలానికి విజయనగరం జిల్లాలో అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ సోమవారం తెలిపింది. ఇప్పటివరకు 12,606 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా కాగా.. ప్రస్తుతం 2,914 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని పేర్కొంది. అదనంగా 800 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరనుంది. రైతులు సిఫార్సు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలని అధికారులు సూచించారు.

News January 13, 2026

మెదక్: ST రిజర్వేషన్.. BC మహిళ సర్పంచ్!

image

సర్పంచ్ ఎన్నికలలో ఎస్టీలకు, బీసీలు అన్యాయం చేశారని బంజారా సేవాలాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపించారు. టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి సర్పంచ్ ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. ఎరుకల రాంబాయి అనే బీసీ మహిళ ఎస్టీ కులధ్రువీకరణ పత్రంతో ఎన్నికలలో పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందింది. సర్పంచ్‌పై సమగ్ర విచారణ జరిపాలని తహశీల్దార్ తులసిరామ్‌కు వారు వినతి పత్రాన్ని సమర్పించారు.

News January 13, 2026

ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్!

image

TG: రాష్ట్రంలో పండగ వేళ ఎన్నికల సందడి మొదలుకానుంది. మున్సిపల్ ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదల చేయడంతో షెడ్యూల్ రిలీజ్‌కు SEC సిద్ధమైంది. 1,2 రోజుల్లో షెడ్యూల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. FEB రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నెల 20 నాటికి రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం SC, ST, డెడికేషన్ కమిషన్ ఆధారంగా BC రిజర్వేషన్లను ప్రకటించనుంది.