News December 14, 2025
గద్వాల్: మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం బింగిదొడ్డి గ్రామంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దొడ్డప్ప స్వగ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి చెందాడు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఉప్పరి వెంకటేష్ 60 ఓట్ల తేడాతో గెలుపు సాధించాడు. బీఆర్ఎస్ పార్టీలో ఖాతా తెరిచింది. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమితో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
Similar News
News January 8, 2026
మెట్రో, RTC, MMTSకి ఒకే టికెట్

TG: మెట్రో, MMTS, RTC సేవలను అనుసంధానం చేసే కీలక ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. నెలరోజుల్లో ఈ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లలో దిగిన ప్రయాణికులు నేరుగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. మూడు రవాణా సేవలకు కలిపి ఒకే టికెట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
News January 8, 2026
SV ఆర్ట్స్ కళాశాలకు ఇన్నోవేషన్ సెంటర్

తిరుపతిలోని TTD ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు ఇన్నోవేషన్ సెంటర్‌ను కేంద్ర మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఈ సెంటర్ దోహదపడుతుంది. విద్యార్థుల ఆలోచనకు జీవం పోసి నూతన ఆవిష్కరణలను వెలికితీయవచ్చు. దీనిపై కళాశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.
News January 8, 2026
ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్

TG: ఏప్రిల్‌లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించామని తెలిపారు. ప్రతి అర్హుడైన పేదవాడికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏటా 2 విడతలుగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని, లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు.


