News December 14, 2025
పాలకొల్లులో వైసీపీ రాష్ట్ర నేతకు సీఐడీ నోటీసులు

వైసీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళకు సీఐడీ అధికారులు పాలకొల్లులో నోటీసులు అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో 2022లో పాలకొల్లు టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ కేసు దర్యాప్తులో భాగంగా తనకు ఈ నోటీసులు ఇచ్చారని, ఈ నెల 15న రాజమండ్రిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నట్లు చంద్రకళ తెలిపారు.
Similar News
News March 10, 2026
ATM కార్డు మార్చి.. తణుకులో వృద్ధుడికి కుచ్చుటోపీ

ఏటీఎం కేంద్రంలో సహాయం చేస్తానని నమ్మించి ఓ వృద్ధుడిని మోసగించిన ఘటన తణుకులో కలకలం రేపింది. ఎన్‌ఎస్‌సీ బోస్ రోడ్డుకు చెందిన బచ్చు సుబ్బారావు సోమవారం ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఏటీఎంలో నగదు తీయడానికి వెళ్లారు. అక్కడ ఉన్న గుర్తుతెలియని వ్యక్తి సహాయం నెపంతో కార్డు మార్చేసి, సుబ్బారావు ఖాతా నుంచి రూ.23,430 నగదు కాజేశాడు. నగదు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
News March 10, 2026
ప.గో: అదనపు కట్నం వేధింపులు.. భర్తతో సహా నలుగురిపై కేసు

అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్త, అత్త, మరిది, మరదలుపై నరసాపురం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం.. లుటుకుర్తి రాజేశ్‌కు స్వరూపతో 2020లో వివాహమైంది. అప్పటి నుంచి రాజేశ్ అదనపు కట్నం తేవాలని, అనారోగ్యంతో ఉన్న పిల్లాడి వైద్యానికి కూడా డబ్బులు పంపకుండా, గల్ఫ్‌లో ఉంటూ భర్త వేధిస్తున్నాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్ఐ ముత్యాలరావు కేసు నమోదు చేశారు.
News March 10, 2026
ప.గో: మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. చివరకు..

మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, బూతు మాటలతో దూషిస్తున్న మల్లవరపు యేసుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం గ్రామంలోని మహిళలు పంట బోదే వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఆ సమయంలో యేసు అక్కడకి చేరుకొని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలు మొగల్తూరు పోలీసులకు పిర్యాదు చేయగా ఎస్సై జి.వాసు నిందితుడిపై కేసు నమోదు చేశారు.


