News April 20, 2024

ఎల్లుండి టెన్త్ ఫలితాలు విడుదల

image

AP: టెన్త్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించింది. అధికారిక సైట్ RESULTS.BSE.AP.GOV.INతో పాటు WAY2NEWS యాప్‌లో ఫలితాలను వేగంగా, సులభంగా పొందవచ్చు.

Similar News

News March 3, 2026

అప్పుడు నా కెరీర్ ముగిసిందనుకున్నా: స్నేహ

image

తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జీవితాన్ని తలకిందులు చేసిందని నటి స్నేహ వెల్లడించారు. ‘వరుస సినిమాలతో(2002) బిజీగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. తీవ్ర గాయాలవడంతో 8 నెలలు మంచానికి పరిమితమయ్యా. నా కెరీర్ ముగిసిందనుకున్నా. కానీ డైరెక్టర్ కరు పళనియప్పన్ “పార్థిబన్ కనవు”(2003) మూవీలో అవకాశం ఇవ్వడంతో మళ్లీ కెమెరా ముందుకు రాగలిగా’ అని ఇటీవల ఓ ప్రోగ్రామ్‌లో గుర్తుచేసుకున్నారు.

News March 3, 2026

ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు ఎందుకు దాడులు చేయట్లేదు?

image

ఖురాన్‌లో Muslim Ummah అనే విధానం ఉంది. అంటే ప్రపంచంలోని అందరూ ముస్లింలు ఒకే సమూహం/సమాజానికి చెందినవారు అని అర్థం. ఒక దేశానికి కష్టం వస్తే మరో దేశం సహకరించుకుంటాయి. ఒక ముస్లిం దేశంపై మరొక ముస్లిం దేశం దాడి చేయడం Ummah సిద్ధాంతానికి విరుద్ధమని చాలా మంది భావిస్తారు. ఇప్పుడు ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు యుద్ధం ప్రారంభిస్తే ఇజ్రాయెల్‌కు సహకరిస్తున్నాయనే ముద్ర పడుతుంది. ఆర్థికంగానూ తీవ్రంగా నష్టపోతాయి.

News March 3, 2026

మహిళలకు సర్కారు శుభవార్త

image

TG: డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుంది. ఇప్పటివరకు సభ్యులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. బ్యాంకు నుంచి అప్పు తీసుకొని మెంబర్ చనిపోతే దాన్ని ఫ్యామిలీ చెల్లించాల్సి వస్తోంది. ఇక నుంచి మహిళల రుణానికీ బీమా స్కీమ్‌ను GOVT ప్రవేశపెట్టనుంది. దీంతో రుణం తీసుకున్నవారు మరణిస్తే ప్ర‌భుత్వ‌మే బ్యాంకుకు చెల్లిస్తుంది. ఆ సభ్యురాలికి ₹10L బీమా కూడా ఉంటుంది. ఈ బీమా సొమ్మునూ GOVT చెల్లిస్తుంది.