News April 20, 2024

ప్రకాశం జిల్లాలో నేడు 14 నామినేషన్ల స్వీకరణ

image

జిల్లా వ్యాప్తంగా శనివారం ఒంగోలు పార్లమెంట్ స్థానానికి, మిగిలిన నియోజకవర్గాలకు 14 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయం ప్రకటించింది. ఒంగోలు పార్లమెంటుకు 4 నామినేషన్లు, యర్రగొండపాలెంలో 1, దర్శికి 2, ఒంగోలుకు 1, కొండపికి 4, గిద్దలూరుకు 2 చొప్పున నామినేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు నామినేషన్ సమర్పిస్తున్న సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.

Similar News

News March 13, 2026

ప్రకాశం: ఓ ఫొటోతో ఆగిన పెళ్లి.. తల్లీకూతుర్లు సూసైడ్

image

ప్రకాశం జిల్లా మార్టూరు (M) ద్రోణాదులలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల మేరకు.. సుజాత (46) కుమార్తె (26) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మార్టూరు వాసి శేషుబాబుతో డిసెంబర్ 14న ఆమెకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. దివ్యకు పరిచయం ఉన్న ఓ యువకుడు ఆమెతో దిగిన ఫొటోను శేషుబాబుకు పంపాడు. దీంతో పెళ్లి ఆగిపోగా.. మనస్తాపంతో దివ్య, సుజాత ఈ నెల 4న పురుగుల మందు తాగారు. గుంటూరులో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు.

News March 13, 2026

ప్రకాశం: రైతుల ఖాతాల్లో నేడు నగదు

image

PM కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి తెలిపారు. ప్రకాశం జిల్లాలోని రైతులకు రూ.108.30 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. దర్శికి రూ.24.40 కోట్లు, కొండపికి రూ.21.10 కోట్లు, ఒంగోలుకు రూ.5.31 కోట్లు, S.Nపాడు రూ.15.85 కోట్లు, అద్దంకి రూ.23.31 కోట్లు, కందుకూరుకు రూ.18.33 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. శుక్రవారం బ్యాంక్ ఖాతాల్లో నగదు మంజూరు అవుతుందని తెలిపారు.

News March 13, 2026

ప్రకాశం: రైతుల ఖాతాల్లో రూ.108.30 కోట్లు మంజూరు

image

PM కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి తెలిపారు. ప్రకాశం జిల్లాలోని రైతులకు రూ.108.30 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. దర్శికి రూ.24.40 కోట్లు, కొండపికి రూ.21.10 కోట్లు, ఒంగోలుకు రూ.5.31 కోట్లు, S.N పాడు రూ.15.85 కోట్లు, అద్దంకి రూ.23.31 కోట్లు, కందుకూరుకు రూ.18.33 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. శుక్రవారం బ్యాంక్ ఖాతాల్లో నగదు మంజూరు అవుతుందని తెలిపారు.