News December 14, 2025
భారత్‌లోనూ ఉగ్ర దాడులకు కుట్ర?

ఆస్ట్రేలియాలో <<18562319>>కాల్పుల<<>> నేపథ్యంతో భారత్‌లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఢిల్లీ, ముంబై, ఇతర ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు టెర్రర్ గ్రూపులు కుట్ర చేస్తున్నట్లు తెలిపాయి. హనుక్కా పండుగ సందర్భంగా యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లను టార్గెట్‌గా చేసుకున్నట్లు పేర్కొన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
Similar News
News December 25, 2025
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి. రాజ్‌బరి జిల్లాలో 29 ఏళ్ల యువకుడు అమృత్ మండల్‌ను కొట్టి చంపారు. బుధవారం రాత్రి 11 గం.కు రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి దారుణంగా దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అమృత్ దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఈ హింసకు తెగబడ్డారు. కాగా ఇటీవల <<18624742>>దీపూ చంద్రదాస్<<>> అనే హిందూ యువకుడిని కొందరు కొట్టి చంపి, తగలబెట్టిన విషయం తెలిసిందే.
News December 25, 2025
‘అతను అంతమైపోవాలి’.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

రష్యాతో యుద్ధంపై విసిగిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ క్రిస్మస్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అందరిదీ ఒకే కోరిక.. అతను అంతమైపోవాలి’ అంటూ పరోక్షంగా పుతిన్ మరణాన్ని కోరుకున్నారు. రష్యా వెనక్కి తగ్గితే తూర్పు ఉక్రెయిన్ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని జెలెన్‌స్కీ అన్నారు. ఆ ప్రాంతం అంతర్జాతీయ దళాల పర్యవేక్షణలో ఉండాలని కోరారు. ఏదైనా పీస్ డీల్ వస్తే ప్రజాభిప్రాయం తీసుకుంటానన్నారు.
News December 25, 2025
WPL: రేపు సాయంత్రం 6 గంటలకు టికెట్లు విడుదల

ఉమెన్ ప్రీమియర్ లీగ్(WPL)-2026 మ్యాచ్‌ల టికెట్లు రేపు సా.6 గంటలనుంచి అందుబాటులోకి రానున్నాయి. జనవరి 9న లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. నవీ ముంబై, వడోదరా వేదికల్లో ఈ సీజన్ మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 5 జట్లు పాల్గొననుండగా ఎలిమినేటర్, ఫైనల్‌తో కలుపుకొని 22 మ్యాచులు ఉన్నాయి. ఫిబ్రవరి 5న ఫైనల్ జరగనుంది. వెబ్‌సైట్: https://www.wplt20.com/.


