News April 20, 2024
శ్రీకాకుళం జిల్లాలో మూడో రోజు నామినేషన్లు వేసింది వీరే

➤ శ్రీకాకుళం: JBNP అభ్యర్థిగా రాగోలు నాగశివ ➤ ఇచ్ఛాపురం: స్వతంత్ర అభ్యర్థిగా సుగ్గు చక్రవర్తి ➤ ఆమదాలవలస: BCYP అభ్యర్థిగా సిపాన శ్రీనివాసరావు ➤ JBNP అభ్యర్థిగా బురిడీ గౌరి శంకర్ ➤నరసన్నపేట: TDP అభ్యర్థిగా బగ్గు రమణ మూర్తి నామినేషన్లు వేశారు.
NOTE: జిల్లా మొత్తంగా శనివారం నాలుగు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు వేశారు.
Similar News
News March 18, 2026
శ్రీకాకుళం జిల్లా మార్కెట్లలో మామిడికాయల కొరత

శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది మామిడికాయల కొరత ఏర్పడింది. మార్కెట్లో కిలో మామిడి రూ.120-150 పలుకుతోంది. ఒక్కో కాయ సైజును బట్టి రూ.20-50కి కూడా అమ్ముతున్నారు. ధరలు పెరిగినా పండుగ కోసం వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. మంచు ప్రభావం, వాతావరణ మార్పులు వలన పంట లేట్ అయిందని హార్టికల్చర్ అధికారులు తెలిపారు. మీ ఏరియాలో మామిడి ధర ఎలా ఉందొ కామెంట్ చేయండి.
News March 18, 2026
మెక్సికోలో సిక్కోలు యువకుడి మృతి

గార మండలం అంపోలు గ్రామానికి చెందిన నాగుబిల్లి వెంకట ధర్మారావు(28) అనే యువకుడు మెక్సికోలో మృతిచెందినట్లు అక్కడి వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన యువకుడు కొన్నేళ్లుగా మెక్సికోలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రాత్రి తాను ఉండే రూమ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి తల్లిదండ్రులు మంగళగిరిలో వలస కూలీలుగా ఉన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News March 18, 2026
శ్రీకాకుళం: చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

బూర్జ గ్రామానికి చెందిన పీ.వీరమల్లేశ్వరరావు(65) చెరువులో పడి మృతిచెందాడు. పోలీసులు వివరాలు మేరకు.. ఈనెల 5వ తేదీన అయ్యవారిపేటలో జరుగుతున్న అమ్మవారి పండగల్లో డ్యాన్స్ ప్రోగ్రాం చూసేందుకు వెళ్లిన వీరమల్లేశ్వరరావు తిరిగి ఇంటికి రాలేదు. మంగళవారం తోటాడ గ్రామంలోని చెరువులో ప్రమాదవశాత్తు పడిపోవడంతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. ఘటనపై బూర్జ పోలీసులు కేసు నమోదు చేశారు.


