News December 14, 2025
సుస్థిర ఆర్థిక పురోగతిలో ఏపీ: RBI

దేశంలో పలు రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచినట్లు RBI తాజా నివేదిక వెల్లడించింది. ‘1.93 కోట్ల టన్నుల పండ్లు, 51.58 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేసి రెండింటిలోనూ అగ్రస్థానంలో ఉంది. FY24-25లో GSDP ₹15.93 లక్షల CRకు చేరగా తలసరి జీఎస్డీపీ ₹2.66 లక్షలుగా నమోదైంది. ఆరోగ్య పరంగా సగటు జీవితకాలం 70 ఏళ్లకు పెరిగింది. 74 మార్కులతో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనలో 10వ ప్లేస్‌లో ఉంది’ అని ప్రభుత్వం తెలిపింది.
Similar News
News January 5, 2026
ఇతిహాసాలు క్విజ్ – 118 సమాధానం

ప్రశ్న: పాండవులు స్వర్గానికి వెళ్తుండగా ధర్మరాజును చివరి వరకు అనుసరించి, ఆయనతో పాటు స్వర్గం వరకు వెళ్లిన జంతువు ఏది? ఆ జంతువు రూపంలో ఉన్నది ఎవరు?
సమాధానం: ధర్మరాజును చివరి వరకు అనుసరించిన జంతువు కుక్క. నిజానికి ఆ కుక్క రూపంలో ఉన్నది యముడు. తనను నమ్ముకున్న ఆ మూగజీవిని వదిలి స్వర్గానికి రావడానికి ధర్మరాజు నిరాకరిస్తాడు. అతని ధర్మనిష్ఠను, కరుణను పరీక్షించడానికే యముడు ఆ రూపంలో వచ్చాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News January 5, 2026
ఐకానిక్ వంతెనకు టెండర్లు.. తగ్గనున్న 90kmల దూరం

ఏపీ-తెలంగాణను కలుపుతూ సోమశిల వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి కేంద్రం టెండర్లు ఆహ్వానిస్తోంది. 1077 మీటర్ల పొడవైన హైబ్రిడ్ వంతెనను EPC విధానంలో నిర్మించనున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.816.10 కోట్లు కాగా, 36 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నంద్యాల, తిరుపతికి వెళ్లాలంటే కర్నూలు మీదుగా వెళ్లాల్సి ఉండగా ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే 90kmల దూరం తగ్గనుంది.
News January 5, 2026
టీవీకేతో పొత్తుకు బీజేపీ ప్రయత్నాలు?

తమిళనాడులో అధికారమే లక్ష్యంగా BJP పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా విజయ్ TVKతో పొత్తు అవకాశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. లౌకికవాదానికి కట్టుబడిన INCతో సహజ స్నేహం ఉంటుందని ఇటీవల TVK జాతీయ ప్రతినిధి గెరార్డ్ <<18754096>>వ్యాఖ్యల<<>> తర్వాత కాషాయ పార్టీ అప్రమత్తమైనట్లు తెలిపాయి. అధికార DMK వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు అమిత్ షా ప్రణాళిక రచిస్తున్నారని పేర్కొన్నాయి.


