News December 15, 2025
శంకర్‌పల్లి: పల్లె లత యాదిలో గెలిపించారు!

గుండెపోటుతో మరణించిన మాసానిగూడ గ్రామ 8వ వార్డు మెంబర్ అభ్యర్థిని పల్లె లత (42)ను వార్డు ప్రజలు గెలిపించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొన్న ఆమె అస్వస్థతకు గురికాగా కుటుంబీకులు శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి షిఫ్ట్ చేయగా చికిత్స పొందుతూ డిసెంబర్ 7న మృతి చెందారు. కాగా, నేటి ఫలితాల్లో ఆమెకు 30 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
Similar News
News January 12, 2026
పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు

పంట అవశేషాలను కాల్చితే నేలలో కార్బన్ శాతం తగ్గిపోతుంది. నేల ఉపరితలం నుంచి 1cm లోపలి వరకు ఉష్ణోగ్రత 8 డిగ్రీలు పెరిగి నేలలో పంటకు మేలు చేసే బాక్టీరియా, ఫంగస్ నాశనమవుతాయి. వీటిని కాల్చేటప్పుడు వెలువడే కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వల్ల వాతావరణం వేడెక్కుతుంది. ఒక టన్ను పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేల ఉపరితలంలో 5.5kgల నత్రజని, 2kgల భాస్వరం, 2.5kgల పొటాష్, 1kg సేంద్రియ కర్బనం నష్టపోతాం.
News January 12, 2026
ADB: మున్సిపల్ పోరుకు ‘గులాబీ’ వ్యూహం

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో బిఆర్ఎస్ జండా ఎగిరేసి వైభవం సాధించేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మక పావులు కదుపుతోంది. మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా సమాయత్తమవుతోంది. సర్కార్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ఎన్నికల్లో విజయం సాధించేలా అభ్యర్థులను రంగంలోకి దించాలని అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో చూపిన సత్తాను మున్సిపల్ పోరులోనూ పునరావృతం చేయాలని నిర్ణయించింది.
News January 12, 2026
నేడు వెనిజులా.. రేపు ఇరాన్.. తర్వాత..?

ఒక దేశాధ్యక్షుడిని అపహరించి, ట్రంప్ తానే వెనిజులాకు రాజునని ప్రకటించుకోవడం మధ్యయుగాల నాటి మొండితనాన్ని సూచిస్తోంది. ప్రజాస్వామ్యం కావాలనుకుంటే ఎన్నికలు నిర్వహించాలి కానీ, సద్దాం హుస్సేన్ ఉదంతంలా చమురు కోసం ఇలా దాడులు చేయడం సరికాదు. నేడు వెనిజులా, రేపు ఇరాన్, తర్వాత మరోటి. ఇలా అగ్రరాజ్య ఆధిపత్య ధోరణి ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతోందన్నది సామాన్యుడి అభిప్రాయం. మరి దీనిపై మీ Comment..


