News December 15, 2025

సూర్యాపేట: ఒక్క ఓటు తేడాతో BRS మద్దతుదారు గెలుపు

image

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం భక్తలాపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితం చివరి వరకూ తీవ్ర ఉత్కంఠ రేపింది. ఎట్టకేలకు BRS బలపరిచిన అభ్యర్థి జుట్టుకొండ గణేశ్ కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. సంచలన విజయం సాధించడంతో BRS శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గణేశ్ మాట్లాడుతూ.. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అంకితమవుతానని హామీ ఇచ్చారు.

Similar News

News April 19, 2026

‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి మోక్షం ఎప్పుడు..?

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకగా చేపట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలులో జాప్యంపై అభ్యర్థులు ఆశతో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో రాయితీ రుణాల కోసం 55 వేలకు పైగా యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా యూనిట్లు మంజూరు కాకపోవడంతో నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రుణాల పంపిణీ చెయ్యాలని కోరుతున్నారు.

News April 19, 2026

మధ్యాహ్నం వరకు ఎండలు.. ఆపై వర్షాలు

image

TG: ఇవాళ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఎండలు దంచికొడుతుండగా మధ్యాహ్నం నుంచి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం 42–45°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఆపై HYD, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, NZB, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

News April 19, 2026

KNR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ‘సూపర్ మండే’

image

ఈనెల 20 (సోమవారం) రోజున తెలంగాణలో రాజకీయ వేడి తారస్థాయికి చేరనుంది. జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభతో తన జైత్రయాత్రను ప్రారంభించనుండగా, అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఒకే రోజు ఇద్దరు అగ్రనేతల మధ్య సాగనున్న ఈ మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో ‘సూపర్ మండే’గా నిలవనుంది.