News December 15, 2025

VKB: నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి రేపు రద్దు చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున తాత్కాలికంగా రేపటి సోమవారం ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని తెలిపారు. యధావిధిగా మళ్లీ ప్రతి సోమవారం ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని తెలిపారు.

Similar News

News January 14, 2026

ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్న అనిల్ రావిపూడి

image

టాలీవుడ్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు చెబుతూ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. తన కెరీర్‌లో వరుసగా ఆరు సినిమాలు ₹100Cr+ క్లబ్‌లో చేరినట్లు వెల్లడించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తీసిన <<18853731>>MSVPG<<>> అయితే 2రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతిని మరింత స్పెషల్‌గా మార్చారంటూ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.

News January 14, 2026

HYD: సీఎం సభల తర్వాతే మున్సిపల్ నగారా!

image

TGలో మున్సిపల్ పోరుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అయితే, దీనికి ముందే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కలియతిరగనున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 3 భారీ సభలు నిర్వహించనుంది. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఈ సభలు ముగిసిన వెంటనే SEC ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం టూర్ ఖరారైన తర్వాతే క్లారిటీ రానుంది. STAY TUNED..

News January 14, 2026

KNR: సీపీ సెలవుపై ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన సీపీ ఆఫీస్!

image

కరీంనగర్ పోలీస్ కమిషనర్ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది. ఓ ఎమ్మెల్యే ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురై ఆయన సెలవుపై వెళ్లినట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే సీపీ కార్యాలయ వర్గాలు దీన్ని ఖండించాయి. ఆయన ఈనెల 1న ముందస్తుగానే సెలవుకు దరఖాస్తు చేసుకున్నారని, జనవరి 11 నుంచి 17 వరకు వ్యక్తిగత కారణాలతోనే సెలవులో ఉన్నారని స్పష్టం చేశాయి.