News December 15, 2025
హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు: మంత్రి

శ్రీ సత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సవిత ఆదేశించారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్‌తో ఆదివారం మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. హాస్టల్‌లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డుపై రావడానికి కారణాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశించారు.
Similar News
News April 18, 2026
ప.గో : పెట్రోల్ బంకుల్లో జిమ్మిక్కులు…!

జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో సిబ్బంది జిమ్మిక్కులు చేస్తున్నారని సమాచారం. వాహనాల్లోకి పెట్రోల్ నింపకుండానే నిండినట్లుగా సొమ్ములు వసూలు చేసి, వాహనదారులు నిలదీస్తే కాళ్ల బేరానికి వస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. గురువారం రాత్రి పెంటపాడు (M) అలంపురం ఒక పెట్రోల్ బంకులో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. పెట్రోలు కొట్టించి బంకు కూడా దాటకుండానే వాహనం ఆగిపోవడంతో సిబ్బందిని నిలదీసినట్లు తెలిసింది.
News April 18, 2026
MBNR: అక్కడ.. 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. గండీడ్ మండలం సల్కర్‌పేట 43.6, దేవరకద్ర 43.1, కోయిలకొండ మండలం పారుపల్లి, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.9, మేడ్చల్ మండలం దోనూరు కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 42.5, అడ్డాకుల 42.4, మహమ్మదాబాద్ 42.3, MBNR (U/R) 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News April 18, 2026
కాళేశ్వరం బ్యారేజ్‌ల పరిశీలనకు 43 రోజుల గడువు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల వైఫల్య కారణాల విశ్లేషణకు రాష్ట్ర ప్రభుత్వం 43 రోజుల గడువు నిర్ణయించింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో 9 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. మే 30లోగా పరీక్షలు పూర్తి చేసి పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించింది. పనుల పురోగతిపై ప్రతిరోజూ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.


