News December 15, 2025
పలాసను జిల్లాగా ప్రకటించాలి: మాజీ కేంద్రమంత్రి

పలాసను కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై అన్ని పార్టీ నాయకులు కలిసికట్టుగా సహకరించాలని మాజీ కేంద్రమంత్రి కిల్లి.కృపారాణి పేర్కొన్నారు. ఆదివారం టెక్కలిలోని ఆమె కార్యాలయంలో పలాస జిల్లా సాధన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా పలాస జిల్లా ఏర్పడితే మొట్టమొదటిగా లాభపడేది ఇచ్ఛాపురం నియోజకవర్గమేనని, వారి సహకారం అవసరమన్నారు. పలాసను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 9, 2026
మగపిల్లల పెంపకంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి: శ్రీకాకుళం ఎస్పీ

జిల్లా పోలీసు శాఖ మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. సమాజంలో ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పడం కంటే, మగపిల్లలు తప్పు చేయకుండా పెంచడంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News March 8, 2026
SKLM: మహిళా సంఘాలకు రూ.2,266 కోట్లు క్రెడిట్

జిల్లాలో మహిళాసంఘాలకు రూ.2,266 కోట్లు క్రెడిట్ లింకేజీ అందించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళా సాధికారత పథకాల అమల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రకటించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు.
News March 8, 2026
శ్రీకాకుళం: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలకు వేళాయె!

మెరుగైన ఇంగ్లిష్ మీడియం విద్యకు చిరునామాగా మారిన ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 13 మోడల్ స్కూల్స్ ఉండగా, ఒక్క స్కూల్‌లో 100 సీట్లకు ప్రవేశాలుంటాయి. జిల్లాలో 1300 సీట్లు ఉన్నాయి. ఆన్లైన్లో ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.


