News December 15, 2025

నల్గొండ: 1970లో సర్పంచ్ ఎన్నికకు రూ.25 ఖర్చు!

image

1970లో సర్పంచ్ ఎన్నికకు కేవలం రూ.25 మాత్రమే ఖర్చు చేశానని ఉమ్మడి NLG జిల్లా గట్టుప్పల్ మాజీ సర్పంచ్ పోరెడ్డి ముత్తారెడ్డి తెలిపారు. నాడు గ్రామంలో 9 వార్డులు ఉండేవని గుర్తు చేశారు. పరోక్ష పద్ధతిలో సర్పంచ్ ఎన్నికలో 5 వార్డుసభ్యుల మద్దతుతో సర్పంచ్‌గా ఎన్నికయ్యానని, టీ,టిఫిన్స్ ఖర్చులకే రూ.25 వెచ్చించానని,ఓటర్లకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.నాడు ఓటింగ్ నిజాయతీగా జరిగేదని నేడు రూ.లక్షలు అవుతున్నాయన్నారు.

Similar News

News March 4, 2026

రాజమండ్రి: అపార్ట్‌మెంట్‌లో వివాహిత ఆత్మహత్య

image

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు పరిధిలోని హుగ్గం పేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న GVK Signature 202 అపార్ట్‌మెంట్‌లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు, అనుమానమే ఈ ప్రాణం తీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 4, 2026

పంచాయతీల్లో ‘పంచాయితీ’!

image

TG: 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల్లో చిచ్చు పెట్టాయి. ప్రతి ఊరికి రూ.6లక్షలు జమ కాగా వీటిని పాత బిల్లుల చెల్లింపులకూ వాడాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతంలో తాము ఖర్చు చేసిన బకాయిలు చెల్లించాలని పాత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిధులను కొత్త పనులకే వెచ్చిస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నిత్యం గొడవలే జరుగుతున్నాయి.

News March 4, 2026

విజయవాడ IAS భార్య మృతి అప్డేట్ ఇదే..!

image

సీనియర్ IAS అధికారి GC కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక మృతి అనుమానాస్పదం కాదని సహజ మరణమేనని ధ్రువీకరిస్తూ కేసును క్లోజ్ చేశారు. 2026 జనవరి 4న సత్య దీపిక మృతి చెందారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర దర్యాప్తు ఆధారంగా సత్యదీపిక మృతి అనుమానాస్పదం కాదని సహజ మరణమే అని తేల్చారు. దీంతో ఆయా శాఖలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసును అధికారికంగా మంగళవారం క్లోజ్ చేశారు.