News December 15, 2025

రాష్ట్ర స్థాయిలో కర్నూలు జిల్లాకు మూడవ స్థానం

image

అనంతపురం జిల్లాలో జరిగిన ఐదవ రాష్ట్రస్థాయి డాన్స్ స్పోర్ట్స్ పోటీలలో కర్నూలు జిల్లాకు మూడో స్థానం లభించినట్లు రాష్ట్ర సంఘం కార్యదర్శి సురేంద్ర ఆదివారం తెలిపారు. జిల్లా కార్యదర్శి నాగేశ్వరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీలలో కర్నూలు జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ సాధించినట్లు తెలిపారు. సభ్యులు అమరేశ్, శ్రీనివాస్ తదితరులు అభినందించారు.

Similar News

News March 5, 2026

ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,742 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 10,305 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

News March 5, 2026

విందులు చేశారు.. పరిశుభ్రత మరిచారు!

image

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ ఛాంబర్ సమీపంలో కొందరు అధికారులు విందులు చేసి, ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రం చేశారు. ప్రతీ శనివారం పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేయించే కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఇలా చేయడమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. పది మందికి మంచి చెప్పాల్సిన అధికారులే నిబంధనలు పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News March 5, 2026

కర్నూలు: 395 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

పత్తికొండ శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని తెలిపారు.