News December 15, 2025
కడప కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం కడప కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి సభా భవన్లో జరిగే కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చునన్నారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా జరుగుతుందన్నారు.
Similar News
News January 26, 2026
కడప: ఇన్‌స్టాతో పరిచయం.. లాడ్జిలో యువతిపై అత్యాచారం

తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. అలిపిరి CI రామ్ కిశోర్ వివరాల మేరకు.. కడప(D) బద్వేల్‌కు చెందిన యశ్వంత్ చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. ఇన్‌స్టా ద్వారా తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన అమ్మాయి పరిచయమైంది. ఆమెను మాయమాటలతో హోమ్‌స్టేకు పిలిపించిన విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.
News January 26, 2026
కమలాపురంలో BJP ఓటు బ్యాంకు ఎంత..?

కమలాపురం నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు ఎంతనే దానిపై చర్చ జరుగుతోంది. జనతాపార్టీ (JP) నుంచి 1978 ఎన్నికల్లో రామిరెడ్డి పోటీ చేయగా 24,101(32.9%) ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 1994లో బీజేపీ తరపున కుమార్‌రెడ్డి పోటీ చేయగా 726(0.71%) ఓట్లు పడ్డాయి. 2009లో రాంమోహన్‌రెడ్డికి 648(0.48%) ఓట్లు, 2019లో పాలెం సురేశ్ కుమార్‌రెడ్డికి 1,005(0.63%) ఓట్లు వచ్చాయి. మిగతా ఎన్నికల్లో అలయెన్స్‌లో బీజేపీ పోటీ చేయలేదు.
News January 26, 2026
YVU ఫైన్ఆర్ట్స్ శాఖలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ.!

కడప YVU పీజీ కళాశాల ఫైన్‌ఆర్ట్స్ శాఖ కూచిపూడి నృత్యంలో మహిళా బోధకురాలి నియామకం కోసం ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు డిప్లొమా ఇన్ కూచిపూడి డ్యాన్స్/ పీజీ ఇన్ కూచిపూడి డ్యాన్స్ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సంప్రదించాలని సూచించారు.


