News April 20, 2024
పవన్‌కు తగ్గని జ్వరం.. జనసేన కీలక విజ్ఞప్తి

AP: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి, ప్రచారంలో శ్రేణులకు జాగ్రత్తలపై జనసేన కీలక ప్రకటన చేసింది. ‘రికరెంట్ ఇన్‌ఫ్లూయెంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి పవన్ నిత్యం ఏదో ఒక సమయంలో జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దు. షేక్‌హ్యాండ్స్, ఫొటోల కోసం ఒత్తిడి చేయవద్దు. పూలు చల్లినప్పుడు నేరుగా ఆయన ముఖంపై పడకుండా చూడండి’ అని కోరింది.
Similar News
News March 19, 2026
మరోసారి భారీగా పడిపోయిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో <<19423062>>బంగారం ధరలు<<>> మరోసారి భారీగా పడిపోయాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ఏకంగా రూ.7,140 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రా. గోల్డ్ రేటు రూ.1,50,280 పలుకుతోంది. అటు 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.6,550 తగ్గి రూ.1,37,750కి చేరింది. ఇవాళ కేజీ వెండి రేటు రూ.10,000 తగ్గి రూ.2.65 లక్షలు పలుకుతోంది.
News March 19, 2026
ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు: CM CBN

AP: జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం అని CM CBN స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6L+ ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగిందన్నారు. ‘ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. <<19422391>>10,060 ప్రభుత్వ ఉద్యోగాలు<<>> భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
News March 19, 2026
వార్ ఎఫెక్ట్.. పెరగనున్న సిమెంట్ ధరలు?

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల ప్రభావం దేశంలోని సిమెంట్ ధరలపైనా పడే అవకాశం ఉంది. MAR నెలాఖరు లేదా APR మొదటి వారంలో ధరలు పెరగొచ్చని నువామా రిపోర్ట్ వెల్లడించింది. పెట్‌కోక్, ప్యాకేజింగ్ ధరలు పెరుగుతుండటంతో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు డీలర్లు ప్రైస్ పెంచొచ్చని తెలిపింది. సిమెంట్ తయారీకి వాడే పెట్రోలియమ్ కోక్ (పెట్ కోక్)ను చమురు నుంచి వెలికితీస్తారు. క్రూడ్ ధరల హైక్‌తో పెట్ కోక్ ధరలూ పెరుగుతున్నాయి.


