News December 15, 2025

IPLలో అదుర్స్.. T20Iల్లో చెత్త ప్రదర్శన

image

భారత ప్లేయర్లు సూర్య కుమార్, గిల్ ప్రదర్శన T20Iల్లో ఆందోళన కలిగిస్తోంది. IPL-2025లో సత్తా చాటిన ఈ ప్లేయర్లు, దేశం తరఫున పేలవ ప్రదర్శన చేస్తున్నారు. IPLలో సూర్య 65.18 సగటుతో 717 రన్స్, గిల్ 50 యావరేజ్‌తో 650 పరుగులు చేశారు. అయితే ఇండియా తరఫున మాత్రం స్కై 14.20 సగటుతో 213, గిల్ 24.25 సగటుతో 291 పరుగులే చేశారు. దీంతో ఈ ప్లేయర్ల స్థానంలో ఇతర ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News January 8, 2026

రైళ్ల శుభ్రతపై భారీగా ఫిర్యాదులు

image

ట్రైన్లలో కోచ్‌ల శుభ్రత, బెడ్‌ రోల్స్‌కు సంబంధించి Rail Madad యాప్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో 8,758 ఫిర్యాదులు నమోదు కాగా, అక్టోబర్ (13,406), నవంబర్‌ (13,196)లో సుమారు 50% పెరుగుదల కనిపించింది. అదే సమయంలో ‘సంతృప్తికర’ ఫీడ్‌బ్యాక్‌లు కూడా తగ్గాయి. ఈ పరిస్థితిని గమనించిన రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోన్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు వేగంగా పరిష్కారమయ్యేలా చూడాలని సూచించింది.

News January 8, 2026

చిన్నారుల దత్తత.. అసలు విషయం చెప్పిన శ్రీలీల

image

నటి శ్రీలీల 2022లో గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. దీనికి గల కారణాలను ‘పరాశక్తి’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించారు. చిన్న వయసులోనే పిల్లలను దత్తత తీసుకోవడానికి ప్రేరణ ఇచ్చింది ఒక దర్శకుడు అని తెలిపారు. “కన్నడలో ఓ సినిమా చేసేటప్పుడు ఆయన నన్ను అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడి పిల్లలు నాకు బాగా దగ్గరయ్యారు. ఇద్దరని దత్తత తీసుకున్నాను” అని చెప్పారు.

News January 8, 2026

గ్రోక్ వివాదం.. కేంద్రానికి ‘X’ నివేదిక

image

‘X’లో <<18744769>>అశ్లీల కంటెంట్<<>> అంశం కేంద్రానికి చేరిన విషయం తెలిసిందే. అలాంటి కంటెంట్‌ను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తాజాగా బుధవారం సాయంత్రానికి ఎక్స్ తన రిపోర్టును సమర్పించింది. దీనిని ఐటీ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. Grokను దుర్వినియోగం చేసే యూజర్లపై కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సదరు సంస్థ హెచ్చరించింది.