News December 15, 2025

భజన పాటలు వింటున్నారా?

image

లైవ్‌లో భజన పాటలు వినడం, పాడటం వల్ల ఎన్నో లాభాలున్నాయట. ఆ పాటలు వింటున్నప్పుడు మన మనసు సానుకూల శక్తిని గ్రహించి, ప్రతికూల శక్తులను బయటకు పంపుతుందట. లయబద్ధమైన శబ్దం మానసిక చికిత్సగా పనిచేసి మన ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుందట. వీటికి మనలోని ఏకాగ్రతను పెంచే శక్తి ఉందని నమ్ముతారు. డోపమైన్ విడుదల చేసి, మన భావోద్వేగ స్థిరత్వాన్ని సైతం పెంచుతాయని డాక్టర్లు చెబుతున్నారు. సామూహిక భజనలు బంధాలను పెంచుతాయి.

Similar News

News March 15, 2026

ఎగుమతులు బంద్.. పడిపోతున్న బియ్యం ధరలు

image

TG: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్ నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంపై ప్రభావం పడుతోంది. క్రమంగా ధరలు పడిపోతున్నాయి. ఈ నెల 8న దొడ్డు ధాన్యం ధర క్వింటా ₹2,550 ఉండగా ప్రస్తుతం ₹2,450కి తగ్గింది. మరో ₹150 వరకు తగ్గే ఛాన్స్ ఉందని మిల్లర్లు చెబుతున్నారు. ఈ సీజన్‌లో మరో 145L టన్నుల బియ్యం మార్కెట్లోకి రానుందని, ఎక్స్‌పోర్ట్ ఆగిపోయినందున కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపరని పేర్కొంటున్నారు.

News March 15, 2026

ఉక్రెయిన్ యుద్ధంలోకి దిగింది.. దాడి చేస్తాం: ఇరాన్

image

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మరిన్ని దేశాలకు పాకే అవకాశం ఉంది. తమ శత్రు దేశాలకు మద్దతు ఇస్తోన్న ఉక్రెయిన్‌పై దాడి చేస్తామని ఇరాన్ పార్లమెంటరీ నేషనల్ సెక్యూరిటీ కమిటీ హెడ్ ఇబ్రహీం ప్రకటించారు. ‘ఉక్రెయిన్ యుద్ధంలోకి దిగింది. మా షాహెద్ డ్రోన్లను నేలకూల్చేందుకు ఇజ్రాయెల్‌కు <<19328794>>సపోర్ట్<<>> చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ భూభాగం మొత్తాన్ని టార్గెట్ చేస్తాం’ అని హెచ్చరించారు.

News March 15, 2026

వార్ ఎఫెక్ట్.. పాక్ ఉద్యోగుల జీతాల్లో భారీ కోత

image

పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ పాకిస్థాన్‌పై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లు <<19319137>>భారీగా పెరగగా<<>>, తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది జీతాల్లో కోతకు ప్రభుత్వం సిద్ధమైంది. 5 నుంచి 30 శాతం తగ్గించేందుకు ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఆమోదం తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో పాక్‌లో ఇంధన, ఆర్థిక సంక్షోభం ముదురుతోందని నిపుణులు చెబుతున్నారు.