News April 20, 2024

నాగార్జునసాగర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్

image

నాగార్జునసాగర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్ మొదలైంది. జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి శనివారం ఎమర్జెన్సీ పంపింగ్‌ను ప్రారంభించారు. మొత్తం పది పంపులతో నీటిని తోడేస్తున్నారు. సాగర్‌లో HYD నగర తాగునీటి అవసరాల దృష్ట్యా ఎమర్జెన్సీ పంపింగ్ మొదలైనా, ఇంకా ఎమర్జెన్సీ పరిస్థితులొస్తే రెండో దశ ఎమర్జెన్సీ పంపింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లన్నీ చేసి సిద్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 14, 2025

NLG: నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలు: జిల్లా ఎస్పీ

image

నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా నల్గొండలోని సెయింట్ ఆల్ఫన్స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంప్యూటర్ యుగంలో యువత చిన్న వయస్సులో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

News November 14, 2025

NLG: చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి: కలెక్టర్

image

బాలికలు చదువునే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

News November 14, 2025

NLG: చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు

image

జిల్లాలో చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్‌ వస్తున్నదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనుండగా.. ఇప్పటివరకు 60 లక్షలకు పైగానే చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలోని ముత్యాలమ్మ చెరువు, కోతకుంట, ఉంగూరుకుంట చెరువులకు పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యకారులు ఆరోపించారు.